Tuesday, December 11, 2012

Confidence


నేను: ఈ రోజు Date ఎంతో తెలుసా?
చిన్నది: 12
నేను: Full date చెప్పు?
చిన్నది: 12-12-12
నేను: చూసావా? ఈ Date మళ్ళీ 100 years కి గానీ రాదు.
చిన్నది: ఐతే ఏంటి?
నేను: 100 years తరువాత మనం వుండము కదా?
చిన్నది: నువ్వు చచ్చిపోతావ్, నేను బతికేవుంటాను!

Wednesday, December 05, 2012

Looks good on paper

India lost to England 4-0 in England, Reason being Indian batting not good on Seaming wickets; India lost to Australia 4-0 in Australia, Indian batting not good on bouncy pitches;India lost to England in Mumbai, Indian batting not good on spinning tracks; Now India 273-7 in Kolkatta, Indian batting not good on flat pitches - Don't despair Indian cricket fans, with Sachin in the team, it LOOKS good....... on PAPER :-)

Saturday, November 10, 2012

డిగ్రీ

శ్రీను: ఒరే ప్రసాద్, నువ్వు డిగ్రీ చేశాక ఇంట్లో ఖాళీగా ఈగలు తోలుతున్నావని, మీ నాన్న నీతో MBA చేయించాడు  కదరా, ఇప్పుడు ఏంచేస్తున్నావు?
ప్రసాద్: ఇప్పుడు నేను రోజుకి, వారానికి, నెలకి ఎన్ని ఈగలు తోలాను, ఎన్ని దోమలు చంపాను, చక్కగా Dashboards చేసి నాన్నకి చూపిస్తున్నాను 

Friday, August 31, 2012

పిల్లి డాన్స్

పులి పెళ్ళికి పిల్లి డాన్స్ చేసిందట, ఎందుకు?
రేపటినుంచి నువ్వుకూడా మా బాచే కదా అని అట!
పి .స్. ఇది నా original కాదు కాని first time విన్నాను. బావుంది కదా?

Joining sentences using "And"

Today, my daughter's home work was about joining sentences using "And". For example "Susan bought eggs. Susan bought milk" can be combined as "Susan bought eggs and milk". She had a few easy ones like this and then she had the following:
 "George threw the garbage away. George cleaned the house". 
Guess what she did; she combined these two  as "George threw the garbage and the house"

Friday, August 10, 2012

సిమ్ము లేని మొబైలు

సిమ్ము లేని మొబైలు,సాహ-
సమ్ము చేయని సైనికుడు
దమ్ము లేని సిగరెట్టు
గ్రక్కున విడువన్గ వలయు గదరా కుమతీ!

బంతి

మా చిన్నది నిన్న బంతితో ఆడుకుంటున్నది. ఆ ఆటలో భాగంగా, పక్కింటి గోడకేసి గట్టిగా bounce చేసి catch పడుతుంది. ఇంతలో, పక్కింటి ఆంటీ సడన్ గా తలుపు తీసి బయటకు వచ్చి అరిచింది "ఏయ్, ఎందుకు మా గోడకు బంతితో కొడుతున్నావు? గోడలు పాడైపోతై కదా?"
మా చిన్నది అంది "సారీ ఆంటీ, మీరు ఇంట్లో లేరు అనుకున్నాను"

Friday, August 03, 2012

మానేశార్ Plant Lockout

ఉద్యోగులు పని మానేశార్
అందుకే ఆ Plant మూసేశార్....
(Hope it will reopen soon considering the plight of so many workers!)

Tuesday, July 31, 2012

వాన లెక్కలు...

రాము: ఈసారి వానలు అంతగా పడలేదని ఎలా చెప్పగలవురా?
సోము: మా కాలనీలో ఈ వానాకాలం మొదలవడానికి ముందు వేసిన రోడ్లు ఇంకా పాడవలేదు, అందుకనే!

Wednesday, July 18, 2012

"ఈగ" Rumor - Casting couch

The phenomenal success of S.S.Rajamouli directed movie "ఈగ", has created lot of buzz in Tollywood and of course, brought about it's own share of rumors.

Rumor has it that, Rajamouli actually wanted to cast a "honey bee" as the main protagonist but had to settle for a common "ఈగ" when the bee didn't turn up for audition fearing casting couch...

Monday, July 09, 2012

Why the office space absorption went up in some cities - Easy to explain

Office space leasing shows 5% rise in city
Swati Bharadwaj Chand, TNN Jul 5, 2012, 12.19AM IST

A study by global real estate consultancy firm Cushman & Wakefield has found that office space absorption in Hyderabad grew 5% at a time when the overall office space absorption across top eight cities of the country plummeted 21% to 13.4 million sft as compared to 16.9 million sft in the first half of 2011. This steep drop in office space absorption for the January-June 2012 period was led by top IT/ITeS hubs of Bangalore, NCR, Chennai and Pune, while office space absorption went up in cities like Hyderabad, Mumbai, Kolkata and Ahmedabad during the same period thanks to demand for office space.

Friday, June 29, 2012

100 కి 100



నేను: 2 టేబుల్ చెప్పు
చిన్నది: నేను ఒకటి చెప్పనా డాడీ?
నేను: చెప్పు
చిన్నది: నాకు 100 కి 100 వచ్చింది
నేను: Excellent. ఎందులో?
చిన్నది: Cursive writing లో
నేను: Very good. చూపించు.
చిన్నది: అంటే, Teacher చెప్పారు, కాని Book లో రాయలేదు!
నేను: No problem, నాకు చూపించు ఎలా రాసావో?
చిన్నది: అంటే, 100 కి 100 వచ్చేది, కొంచెం mistakes చెయ్యకుండా వుంటె..
నేను: సరే, ఇంతకీ ఎంత వచ్చాయి? సరిగా చెప్పు!
చిన్నది: ఈ రోజు, cursive writing రాయలేదు!
నేను: okay... 2 టేబుల్ చెప్పు ఇప్పుడు...
చిన్నది: నేను చెప్పనుపో! mummyతో చెపుతా నువ్వు నన్ను కొట్టావని!
నేను (మనసులో): దీనికి పెద్దయ్యాక politics లో మంచి future వుంది!!!!!!!