మా ఇంట్లో బల్లులు ఎక్కువగా వున్నాయి. వాటిని ఎలా వదిలించుకోవాలో అని వెబ్ లో కొంత రిసెర్చ్ చేసాను. కొంత మంది ఎగ్ షెల్స్ ని బల్లులు ఎక్కువగా తిరిగే చోట్ల పెట్టమని సలహా ఇచ్చారు.
నిన్న సాయంత్రం మా ఇద్దరమ్మాయిలకి ఆమ్లెట్స్ వేసిచ్చి, ఆ ఎగ్ షెల్స్ ని కిచెన్ ఫాల్స్ సీలింగ్ కార్నర్స్ లో పెట్టడం మొదలు పెట్టాను. పెద్దమ్మాయి అడిగింది "డాడీ, ఎందుకు అలా చేస్తున్నావు?" నేను నా వెబ్ రిసెర్చ్ తన ముందు ప్రదర్శించడానికి ఇలా చెప్పడం మొదలు పెట్టాను. "బల్లికి స్నేక్స్ అంటే భయం. అందుకే బల్లులు ఆ ఎగ్ షెల్స్ చూసి ఈ ఇంట్లో ఏదో పెద్ద స్నేక్ వుందనుకోని పారిపోతాయ్". ఇంతలో మా చిన్నమ్మాయి అంటుంది "డాడీ, పెద్దగా మాట్లాడకు, బల్లులకి మన ప్లాన్
తెలిసిపోతుంది!"