ఈ రోజు మా కాలనీలోకి గంగిరెద్దుని ఆడించేవాళ్ళు వచ్చారు; తండ్రి, తల్లి, వాళ్ళ అబ్బాయి (13 ఏళ్ళు వుండచ్చు) వున్నారు ఆ గంగిరెద్దుతో. కాసేపు సన్నాయి వాయించిన తరువాత డబ్బులు అడిగారు. నేను పెద్దాయన చేతిలో 20 రూపాయలు పెట్టాను. ఆయన ఆనందంగా పక్కింటికి బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళిన తరువాత కూడ, వాళ్ళబ్బాయి ఇంకా అక్కడే నుంచోని నన్ను డబ్బులడగడం మొదలుపెట్టాడు. నేను తనతో అన్నాను, "మీరందరూ ఒకటే కదా, already ఇచ్చేశాను కదా మీ నాన్నకి" అన్నాను. "కానీ సార్ ఈమధ్య మానాన్న నన్ను నా కాళ్ళమీద నేనే నిడబలాలని సావకొడుతున్నాడు సార్, please నాక్కూడ ఏమైనా ఇవ్వండి" అన్నాడు. నాకు నవ్వాలొ లేక ఏడవాలో అర్ధం కాలేదు!