Original song and Lyrics here: http://www.lyriclahari.com/2013/07/aaradugula-bullettu-song-lyrics.html
అదనపు కొవ్వు పెరిగి మంచ మెక్కిపోయిన ఊబ మనిషి కోసం
తరలింది తనకుతానే ఆహారం, ఫలహారం
తెరిచిననోటినుంచి నేల జారిపోయిన చీకు ముక్క కోసం
వంగింది చూడు సగమె తన దేహం అతి కష్టం
పెసరట్టో మినపట్టో
వదలద్దో దీని పనిపట్టో
దున్నపోతు వొంటి లాంటి నైజం
వీడు ఎనుములన్ని ఒక్కటైన భారం
రక్కసుడో రాక్షసుడో
మెస్సులకే శిక్షకుడో
చుట్టుకొలత లేని వింత మ్రుగం
చిన్న బావిలోతు అన్నమైనా మాయం
నడిచొస్తే దడిపించు బూచి
పరిగెడితే అదురును భూమి
హలీమునే హరించినా అష్టనిక్రుష్టుడో
తిను ఆరడుగుల మినపట్టూ
తిను అల్లం వేసిన పెసరట్టూ...
చరణం: అరకేజీ అన్నాన్నే
అరనిముషం సమయములో
అవలీలగ ఆర్చేస్తాడూ
మొలతాడే తెంచుకొనీ
పైకెదిగిన ఉదరానికి
కనిపించని చొటే చూపిస్తాడూ
తిండిలో, నిద్రలో
భీముని మించిన మానవుడో
తినుటకే బతికెడీ
అసహ్యుడు వీడురో
తిను ఆరడుగుల మినపట్టూ
తిను అల్లం వేసిన పెసరట్టూ...
చరణం: మితిమించిన ఆకలితో
తినిపెంచిన కండలనీ
కరిగించని వంచని తుచ్ఛుడు వీడు
వడి వడిగా పరిగెత్తి
అపుడెపుడొ కనుమరుగై
అగుపించని జడబర్రె ఇతనూ
సాంబారె జుర్రేసి అలసిన సొలసిన సోమరుడు
సంద్రాన్నే తాగేసే సమర్ధుడు వీడురో
తిను ఆరడుగుల మినపట్టూ
తిను అల్లం వేసిన పెసరట్టూ...
4 comments:
fentastic
adiri poyindi guruvu gaaru
Super Parody...Liked it..ba navvukunam...lyric sense and timing super
Thank you all for your comments
Post a Comment