Saturday, October 19, 2013

పాత సామెతలు - కొత్త టెన్నిస్ సామెతలు

పాత సామెతలు   /    కొత్త టెన్నిస్ సామెతలు

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది  /   ప్రతి ఏస్ వెనక ఒక డబుల్ ఫాల్ట్ ఉంటుంది.

పరిగెత్తి పాలు తాగేకంటే, నిలబడి నీళ్ళుతాగడం మంచిది  /  ఎగబడి "రాలీ" ఆడేకంటే, నిలబడి "వాలీ" ఆడటం మంచిది

నా బంగారు పుట్టలో వేలుపెడితే, కుట్టనా / నా బాక్ హాండ్ కి బాల్ ఇస్తే, "slice" చెయ్యనా

తపన ఎక్కువ, తడి తక్కువ /   ఆట తక్కువ, ఆత్రం ఎక్కువ

ఏడ్చే వాడికి ఎడంచేతి పక్కన, కుట్టేవాడికి కుడిచేతి పక్కన కూర్చోకూడదు
/ కొట్టేవాడి కుడిచేతికి, Slice చేసేవాడి ఎడంచేతికి బాల్ వెయ్య కూడదు

తాతకి దగ్గులు నేర్పించడం.../ ఫెడరర్ కి forehand నేర్పించడం...
 

No comments: