Wednesday, November 21, 2018

పెళ్ళంటే పెళ్ళె...,

పెళ్ళంటే  పెళ్ళె...,

అల్లరి చేసే పిల్లాణ్ని అదుపు చేయడానికి తల్లి

‘ఒరే! నీ పెళ్లి చేస్తానుండు’ అని బెదిరిస్తుంది.
అంతే!
వాడి అల్లరి అటకెక్కిపోతుంది.
చేతులు కట్టుకుని మరీ నిలబడతాడు.

అదీ "పెళ్లి "
అనే మాటకున్న
"శక్తి!"

 పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.
‘కాదు... కాదు
నూరేళ్ల వంట’ అని కస్సుమంటారు
ఆడవాళ్లు.

అయినా పంట లేనిదే వంట ఎక్కడుంది? ఇదోరకం అద్వైతం.

పెళ్లి సరసాలకు మూలం. సరదాలూ ఉంటాయి.

‘తాళి కడితే ఖాళీ’ అంటారు కొందరు.
నిజమే దంపతులు ఒకరికొకరు
మానసికంగా
తమ సర్వస్వం ధారపోసుకోవడంతో
ఖాళీ అయిపోతారు.

‘ఇతరులకు ఇందులో ప్రవేశం ఉండదు!’

‘అప్పగింతలవేళ అమ్మాయికది
ఆఖరి ఏడుపు.

అబ్బాయికది ఆఖరు నవ్వు’ అంటారు
విజ్ఞులు.

తత్వం బోధపడితే ఏడుపైనా,
నవ్వయినా ఒక్కటేగా.

ఏడ్చినా నవ్వినా
కన్నీళ్లే అయినప్పుడు
దాని గురించి ఆలోచన ఎందుకు?

ఏదో ఒకటి లేదనేదే ఏడుపునకు మూలం.

అది ఎంతోమందికి పెళ్లప్పటి నుంచే మొదలవుతుంది.

అసలు సమస్య అదే!

‘మా ఆయనకు నోట్లో నాలుక లేదు’
అని ఒకావిడ బాధపడిపోతుంటుంది. అది అనవసరం.

సాక్షాత్తూ బ్రహ్మకే
నోట్లో నాలుక లేదు.
ఆ నాలుక
సరస్వతీదేవిది. ‘

మా ఆయనకు
హృదయం లేదు’
అని మరొకావిడ
పతిదేవుణ్ని
తూలనాడుతుంటుంది. అది అన్యాయం!

విష్ణుమూర్తికే
సొంతానికి హృదయం లేదు.
దానిని లక్ష్మీదేవి
ఎప్పుడో ఆక్రమించేసింది.

‘మా ఆయన
ఒక్క అడుగు కూడా సొంతంగా వేయలేడు’
అని ఒక ఇల్లాలు బాధపడిపోతుంటుంది.
ఏం చేస్తాం?

శివుడికే ఆ పరిస్థితి లేదు. అర్ధనారీశ్వరుడాయే!
ఒక కాలు పార్వతిదే.
అదే ఆయన అవస్థ.

ఇన్ని నిజాలు తెలిసీ
భర్తల గురించి ఆడిపోసుకోవడం ఎందుకట అంటారు కొందరు పతులు.

సరికొత్త మానవపరిణామ సిద్ధాంతానికీ బాటలు వేసేది పెళ్లే.

‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్నారు.

పెళ్లి కాగానే ఆ వంద కోతులూ మాయమైపోతాయి.

చెప్పింది వింటూ,
పెట్టింది తింటూ బుద్ధిమంతుడిగా మారిపోతాడు వివాహితుడు.

హెల్మెట్టూ
భార్యా ఒకే రకం.

నెత్తిన పెట్టుకుంటే తలకాయకు
బోలెడంత భద్రత
అని ఒకాయన
స్వానుభవంతో ఉపదేశించాడు.

పెళ్లి చేసుకొనుటయా? మానుటయా?
అని ఈ రోజుల్లో బ్రహ్మచారులు తర్జనభర్జనలు పడుతున్నారు.

అయినా పెళ్లి
చేసుకొనుటే
ఉత్తమంబు,
ఉత్తమంబు.

వెనకటికి మహాతాత్వికుడయిన సోక్రటీసును
శిష్యుడొకరు
‘గురూజీ పెళ్లి
చేసుకొమ్మని
మావాళ్లు
ఒత్తిడి చేస్తున్నారు.
తమరి సలహా ఏమిటి?’ అని అడిగాడు.

ఆయనేమో ‘చేసుకో నాయనా’ అన్నాడు తాపీగా.

శిష్యుడు జుట్టు పీక్కుని ‘ఏంటి గురూజీ అలా అన్నారు?

మీ ఇంట్లో అమ్మగారు గయ్యాళి అని అందరికీ తెలుసు.
అయినా పెళ్లి చేసుకొమ్మని నాకు సలహా ఇస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.

దాంతో సోక్రటీసు

 ‘నాయనా! పెళ్లి చేసుకుంటేనే మేలు.

భార్య అనుకూలవతి అయితే గొప్ప భోగివి అవుతావు.

కాకపోతే గొప్ప తాత్వికుడివవుతావు. ఏదయినా మంచిదే కదా!’ అన్నాడు.

దేవుడు ప్రతిచోటా తాను ఉండలేక తల్లుల్ని సృష్టించాడంటారు.

మరి అదే దేవుడు
భార్యల్ని ఎందుకు సృష్టించాడు?

ప్రతి ఇంట్లో పోలీసుల్ని పెట్టలేక భార్యల్ని సృష్టించాడు.

భార్యే లేకపోతే ఎన్ని అరాజకాలు?
ఎన్నెన్ని ఘోరాలు?
ఎన్నెన్ని నేరాలు? శాంతిభద్రతల పరిరక్షకురాలు
ఇల్లాలే.

ప్రతి ఇంటికి
పెళ్లి ఇచ్చిన
వరప్రసాదమే ఇల్లాలు.

అయినప్పటికీ
‘వివాహం ప్రకృతి,

వివాదం వికృతి’ అని వెనకటికి ఒకాయన ‘పెళ్లి’కిలించాడు.

కానీ ఈ వివాదం
సంతోషం సృష్టించాలి.

సంతోషం దాంపత్యానికి సగం బలం-
కాదు కాదు
సంపూర్ణ బలం.

ఎవరు గెలిచినా
ఇద్దరూ గెలిచినట్టే.

పండంటి కాపురానికి
పది సూత్రాలు అంటారుగానీ

ఈ ఒక్క
‘మంగళ’కరమైన
సూత్రాన్నీ
జాగ్రత్తగా
కాపాడుకుంటే చాలు.

భార్యాభర్తలన్నాక ఎక్కసక్కె
మాడుకోకపోతే
ఏం మజా?

‘కన్యాదాన
సమయంలో
మీ నాన్న నా కాళ్లు పట్టుకుని,
కడిగినప్పుడు
నీకు ఏమి అనిపించింది?’ అని కొత్తగా పెళ్లయిన యువకుడు
తన భార్యను అడిగాడు.

ఆమె తడుముకోకుండా ‘ఆయన వసుదేవుడిలా కనిపించాడండీ’ అంది నవ్వుతూ.

దాంతో మొగుడు కంగుతిన్నాడు.

ఆ మాటకొస్తే
అతివ అంటే
ఎక్కువగా
మాట్లాడు వ్యక్తి
అనేదే పిండితార్థం. పండితార్థం.

మూడు ముళ్లయినా,
ఏడు అడుగులయినా ముసిముసి నవ్వులకు మూలకందాలే.

పూలు తలలో పెట్టినా, చెవిలో పెట్టినా పెళ్లి పెళ్లే! దానికి సాటీ లేదు!
పోటీ లేదు!

ఏమంటారు మరి..

Friday, November 09, 2018

ఆపిక

ఇటీవల ఖమ్మం లో జరిగిన ఒక అష్టావధానం లో అప్రస్తుత ప్రసంగం లో పృచకుడి ప్రశ్న :-

"అవధాని గారు...నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి పేరు దీపిక, రెండో అమ్మాయి పేరు గోపిక. ఇపుడు మూడో అమ్మాయి పుట్టింది. ఏం పేరు పెడితే బాగుంటుంది??"

అవధానం గారి సమాధానం :- "ఆపిక !!" 😜😂😂😂

ICU

ICU లో ఉన్నవాడు  తన రాశి  ఫలం  చూస్తే ఇలా ఉన్నది...
  ఈరోజు మీకు శుభదినం ,
దూర ప్రయణం ,తక్కువ కర్చు , పాత మిత్రులు బంధువులను కలుస్తారు 
ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదు

Hurry Home

అమెరికాలో ఉన్న ఒక భారతీయుడికి హార్ట్ ఎటేక్ వచ్చి, అంబులెన్స్ లో తీసుకెళ్ళ్తున్నారు.
 భక్తుడైన అతను దారిలో ‘’ హరి ఓం, హరి ఓం’’ అని హరి నామ స్మరణ చేస్తున్నాడు.అంబులెన్స్ ఇంటికి వచ్చేసరికి ,ఆ వ్యక్తి భార్య గుండెలు బాదుకుంటూ అంబులెన్స్ హాస్పటలు కి కాకుండా ఇంటికెందుకు తీసుకొచ్చారు అని అంబులెన్స్ సిబ్బంది మీద మండిపడింది.
దాని కి వాళ్ళు’’ , “ఏం చెయ్యం మేడమ్, దారి పొడుగుతా మీ ఆయన ‘Hurry home, Hurry home, Hurry home అంటూనే ఉన్నాడు!'”😅😅😅😅😅

Linking

భార్య : డాక్టర్ గారూ మావారు
pan కార్డ్ మింగేసారు తొందరగా
ఏమన్న చెయ్యండి ప్లీజ్ ...
డాక్టర్ : తొందరగా మీ వారిని
ఆధారకార్డ్ మింగమని చెప్పండి
అవి రెండు లింక్ అయ్యేవరకు
నేను ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేను
😄😝😛😋😂😄😝😛

కొత్తకొడలు

ప్రియాతి ప్రియమైన అత్తయ్య గారి పాద పద్మములకు ఆపాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ , మీ కొత్తకొడలు వ్రాయునది ఏమనగా
 మీరు కాపురానికి వస్తున్నప్పుడు నాకు చెప్పిన అన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాను.

కొత్తసంసారం పాలు పొంగినట్టు పొంగి పొర్లాలి  అని చెప్పారు. అందుకే రోజుకి రెండు లీటర్ల పాలు పొంగిస్తున్నాను . పొంగి పొర్లగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం , కాకపోతే రెండు నెలలకే స్టవ్ కమురు కంపు కొట్టటం తో నిన్ననే కొత్త స్టవ్ కొనుకొచ్చాను.

పనీ , పాటా నేర్చుకోమన్నా మీ మాట మీద గౌరవం తో రోజుకి 5 గంటలు , ఏఆర్  రెహ్మాన్ పాటలు వింటూ  ప్రాక్టీస్ చేస్తున్నాను . పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభం చేస్తాను.

మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా అందుకే, వారి ఆరోగ్య దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను .

భర్త ని కష్ట పెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను.

చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారు గా అత్తయ్య అందుకే నిన్న ఎదిరింటావిడ పలకరించబోతే ముఖం మీదే తలుపులు వేసాను . ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీ లా మడిపోయింది .

పొదుపు చేయమన్న మీ మాట తో వారానికి ఒక్క డ్రస్ మాత్రమే కొనుకుంటున్నాను . అలాగే రెండు సినిమాలు మాత్రమే చూస్తున్నాం . ఈ నెల పొదుపు చేసిన డబ్బు తో మీ అబ్బాయి కి కొత్త కర్చీఫ్ కొనిచ్చాను .

పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా అందుకె నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను .పాపం కాలు వేలు చిట్లి రక్తం వస్తే కట్టు కూడా కట్టాను . తొందర్లోనే తగ్గిపోతుంది లెండి

మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వివరంగా ఉత్తరం వ్రాయగలరు
        ఇట్లు
               మీ ప్రియమైన కుమారుని పాద దాసి
                                           బాలా త్రిపుర సుందరి .

మూగమనసులు చిత్రంలో "ముద్దబంతి పూవులో" పేరడీ పాట

*ఒక పేరడీ పాట.....*

*మూగమనసులు చిత్రంలో "ముద్దబంతి పూవులో" వరుసలో పాడుకోవాలి...*

ముద్దపప్పు కూరలో - ములగకాడ పులుసులో
తెలుగువారి రుచులు - ఎందరికి తెలుసులే  || ముద్దపప్పు||

మిరపకాయలో కారం దాగుందని తెలుసును
గోంగూరను జోడిస్తే ఏమౌనో తెలుసునా.....ఆ...ఆ..ఆ...
చూసినా....రుచి చూసినా....కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీరెనకాల ఏ కారమో తెలుసునా...... || ముద్దపప్పు||

రసం 'అరవ'దే గాని ఘాటుంటది దానికీ
జ్వరమొచ్చిన మనిషికే తెలిసోస్తుందారుచీ.....
వడియాలను జతచేసి పదిలంగా తినుకో
తినుకొని హాయిగా కమ్మగా నిదురపో.... || ముద్దపప్పు||

ఆవకాయ మాగాయలే ఆంధ్రులకు రక్ష
సున్నుండలు జంతికలే శ్రీరామ రక్ష.....
తిన్నోళ్ళు, తిననోళ్ళ తీపి తీపి గురుతులు
సిరులొలికే పంటలూ- మన తెలుగు వారి వంటలు  || ముద్దపప్పు||
( శ్రీ రాయచోటి కృష్ణమూర్తి గారిచే విరచితము)
~~~~Forwarded~~~~

Rangamma Mangamma song parody

Rangamma Mangamma song parody

Rangamma Mangamma

Oy Upamaa..
upmaaaa
Oy Upamaa..
upmaaaa


Upamaa..
upmaaaa..
Em tiffinoo
Deenikanna gadditinte so betteroo

Elukalenno  Vachiii..
Naa kadpulo tirugutunte..Ye..
Elukalenno Vachiii..
Naa kadpulo tirugutunte..
Dokkalendipoyi Naa
naalki Saluputhunte

Uppammaa Uppammaa..
Antu Ottadee..
Okkasarikaina Dosa
Vesi pettadee

UUppammaa Uppammaa..
Antu Ottadee..
Okkasarikaina Dosa
Vesi pettadee

Aggi laati endalonaaa
tirigi tirigi vasthe
lunch box marichipoyi
pichi aakalestaavunte..

Vantammaa Vantammaa
Vanta cheyadoo
Manchi Neellaina
Sethikiyyadoo.. (x2)


Hey paala vaadu vachee
talupulenno koduthunte ye
talupulannee virigi chevulu pelipoye
sound vasthe
Hey paala vaadu vachee
talupulenno koduthunte ye
talupulannee virigi chevulu pelipoye
sound vasthe
talupamma talupamma ante tiyyadoo
chetta serial okkataina vadilipettadu
talupamma talupamma ante tiyyadoo
chetta serial okkataina vadilipettadu

ప్రజా ప్రతినిధి

*బోధపడిందా?...*😏

‘‘ప్రజా ప్రతినిధి .. ప్రజా ప్రతినిధి అనే మాట తరచూ వినబడుతుంది ... అర్థం ఏమిటి గురూ?’’ అడిగాడు శిష్యుడు.

‘‘ఏమీలేదు నాయనా .. ప్రజలకోసం వచ్చే ప్రతి నిధిని స్వాహా చేసేవాడిని ప్రజా ప్రతినిధి అంటారు’’ చెప్పాడు గురూజీ.🤔

ఫోన్

నేను మా ఫ్రెండు కి 3 సార్లు ఫోన్ చేసాను!!
😐😐😐
వాడు అసలు నా కాల్ కి జవాబు ఇవ్వలేదు!!
ఆఖరికి విసుగొచ్చి చిన్న మెస్సేజ్ పెట్టాను!!🤓

"ఎదురింటి అమ్మాయి , నీ ఫోన్ నంబర్ అడుగుతోంది, ఇవ్వలా ???" అని .

...ఇప్పటికి వాడు నాకు 8 సార్లు ఫోన్ చేసాడు!!!
 🤓🤓🤓
నాతో పెట్టుకుంటాడా!!చచ్చాడు యెదవ 😎

గొడవ

😊 *గొడవపడితే మాట్లాడదేమో అని భయపడేవాడు ప్రేమికుడు*..!!😇

*మాట్లాడితే గొడవ పడుతుందేమో అని భయపడేవాడు భర్త*... 😜

డాక్టర్ సెర్టిఫికేట్

*డాక్టర్ సెర్టిఫికేట్..*😏

"పదిరోజులు ఒంట్లో బాగోలేదని స్కూలుకు రాలేదుగా..
డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మని చెప్పాను ఎందుకు తేలేదు..?" అడిగింది కోపంగా టీచర్. 

"నేను ఎంతగా అడిగినా.. అది
ఆయన కష్టపడి చదువుకుని సంపాదించుకున్న సర్టిఫికేట్‌ అని ఇవ్వనుపొమ్మన్నాడు..!  టీచర్😊😂

కౌశల్ ఆర్మీ

ఏంటండీ సుబ్బారావు గారూ, మీ వాడు మొన్నటి దాకా ఖాళీగా వుండే వాడు ఆర్మీలో ఉద్యోగం వచ్చిందంటగా, ఎంతేంటి జీతం?
సుబ్బారావు: జీతమా నా బొందా, వాడు జాయిన్ అయ్యింది కౌశల్ ఆర్మీలో, ఆ బిగ్ బాస్ బొంద పెట్టా!

పతులుగ మారిన పురుషులు

దేవుని మించిన తోడు
రాముని మించిన ఱేడు
భర్తని మించిన పనోడు
వెదకిన దొరకరు ఏనాడు

కాలము వేసెను గాలము
పెళ్లొక మాయాజాలము
భార్యకు భర్తే దైవము
మరి ఎందుకు నిత్యము కయ్యము

రెక్కలు విరిగిన పక్షులు
చెట్లుగ మారని విత్తులు
కత్తులు పోయిన శూరులు
పతులుగ మారిన పురుషులు

తిరిగెను ఎన్నో గుళ్ళు
వేసెను మూడే ముళ్ళు
వాచెను రోజూ ఒళ్లు
అయ్యో పాపం మొగుళ్ళు

క్షయుడై పోయెను చంద్రుడు
సగమై పోయెను శివుడు
సంద్రము దాటెను రాముడు
దేవుడి పాపమె మగడు

పెళ్ళాం పట్టిన పంతము
తీర్చిన కథ సుఖాంతము
లేనిచో సాధింపే జీవితాంతము
ఇదే అసలు సిసలు వేదాంతము

రాయిని తన్నగనేల
గోడను గుద్దుటనేల
నిప్పున దూకుటనేల
భర్తగ మారగనేల?

వచ్చెడి భావము ఆగదు
శతకము రాసిన చాలదు
ఇది నా భార్యకు నిజముగ నచ్చదు
నను కొట్టక మాత్రము వదలదు

*_-భయపడి పేరు కూడా వ్రాయని అజ్ఞాత రచయిత_*

దేవులపల్లి కృష్ణ శాస్త్రి చాటు పద్యాలు

దేవులపల్లి కృష్ణ శాస్త్రి భావకవిత్వం చెప్పడంలోనే గాదు,సమయానుసారం చాటు పద్యాలు కూడా చెప్పారు.
వేమన శైలిలో అదే మకుటంతో చెప్పారు...చూడండి

పంచదార కంటె పరదార తియ్యన
రాజు కంటె మోజు రంకు మగడు,
ఐన దాని కంటె కానిది మేలయా
విశ్వదాభిరామ వినురవేమ"

దత్తపది

దత్తపది:
వన-జన-ధన-మన....పదములను అన్యార్థంలో వాడి రామాయణార్థ పద్యం....

పూరణ:

ఘనపవన సుతుడు లంకను
జనకజనే  చూచి గెలిచె సంతసమున రా
ముని మనమును,తదుపరి సా
ధనమయ్యెను సీతను పతి దరి జేర్చుటకున్!

-------కోడూరి శేషఫణి శర్మ

ప్రసంగాలు

👍అవధానంలో
అప్రస్తుత ప్రసంగాలు👌

1 . రైలు పట్టాలకూ,
     కాలిపట్టాలకూ
     అనుబంధం ఏమిటి?

రైలు పట్టాల  మీద వుంటుంది,
కాలి మీద పట్టాలుంటాయి.

2 .కనలేని స్త్రీమూర్తి ఎవరు?

న్యాయస్థానము లో వున్న
న్యాయదేవత .
కళ్ళకు గంతలు
కట్టి వుంటారు కదా!

3 .సోమవారాన్ని
    'మండే' అనెందుకంటారు?
    ఆదివారం హాయిగా
    భోంచేసి పడుకుంటాము
    కదా!

సోమవారం పొద్దున్నే
పనికెళ్లాలంటే ఒళ్ళు
మండుతుంది కదా!
అందుకని 'మండే' అంటారు.

4 . ఒక పిల్లవాడు
     ఇంటినుండి పారిపోతే
     కనిపించుటలేదు .
     అని ప్రకటిస్తారు కదా!
     దానికి పిల్లాడి
     స్పందన ఏమిటి?

కని-పెంచుట లేదు .

5 . ఈ రోజుల్లో పిల్లలు
     తల్లిని Head Cook గా
     చూస్తున్నారు .
     మరి తండ్రిని
     ఎలాచూస్తున్నారు?

ATM    లాగా చూస్తున్నారు.

6 . సభలో ఎవరైనా
      ఆవులిస్తే మీరేమి చేస్తారు?

పాలిచ్చేవైతే అవధానం
అయ్యాక యింటికి తోలుకెళ్తా .

7 . మనిషికి
      ఆనందాన్నిచ్చే సిటీ ఏది?

 ----  'పబ్లిసిటీ '

8 . తుద+ తుద =తుట్టతుద,
      కడ  +కడ = కట్టకడ
      అవుతుంది కదా!
      అరటి + అరటి
      ఏమవుతువుంది?

అర టీ+ అర టీ
ఫుల్ టీ అవుతుంది.

9 . క్రికెట్ ప్లేయరుకీ
     అవధానికీ
     సామ్యం ఉందా?

వాళ్ళు  world play కి
వెళ్తారు ,
మేము  words play కి
వెళ్తాము.

10 . 'పురుషులందు
         పుణ్యపురుషులు
         వేరయా' అన్నాడు
         వేమన .
         ఇప్పుడు మీరేమంటారు?

"పురుషులందు
పుణ్యపురుషులు
ఏరయా? అంటాను.

11 . దేవుని గుడికి
        తాళం వెయ్యాలా?         

భజన జరిగే చోట
తాళం తప్పనిసరి.

12 . అద్దంముందున్న
        ఆడువారికీ,
        మైకుముందున్న
        అమాత్యులకీ
        తేడా ఏమిటి?

ఇద్దరికీ సమయం తెలియదు.

పై  అప్రస్తుత ప్రసంగాలు
డా. రత్నాకరం రాము గారి
'ఆ- ప్రస్తుతప్రసంగాలు '
అనే గ్రంథం లోనివి,
వారి సౌజన్యానికి
ధన్యవాదములు.

సేకరణ :- డా. రామడుగు
               వేంకటేశ్వరశర్మ