Friday, November 09, 2018

మూగమనసులు చిత్రంలో "ముద్దబంతి పూవులో" పేరడీ పాట

*ఒక పేరడీ పాట.....*

*మూగమనసులు చిత్రంలో "ముద్దబంతి పూవులో" వరుసలో పాడుకోవాలి...*

ముద్దపప్పు కూరలో - ములగకాడ పులుసులో
తెలుగువారి రుచులు - ఎందరికి తెలుసులే  || ముద్దపప్పు||

మిరపకాయలో కారం దాగుందని తెలుసును
గోంగూరను జోడిస్తే ఏమౌనో తెలుసునా.....ఆ...ఆ..ఆ...
చూసినా....రుచి చూసినా....కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీరెనకాల ఏ కారమో తెలుసునా...... || ముద్దపప్పు||

రసం 'అరవ'దే గాని ఘాటుంటది దానికీ
జ్వరమొచ్చిన మనిషికే తెలిసోస్తుందారుచీ.....
వడియాలను జతచేసి పదిలంగా తినుకో
తినుకొని హాయిగా కమ్మగా నిదురపో.... || ముద్దపప్పు||

ఆవకాయ మాగాయలే ఆంధ్రులకు రక్ష
సున్నుండలు జంతికలే శ్రీరామ రక్ష.....
తిన్నోళ్ళు, తిననోళ్ళ తీపి తీపి గురుతులు
సిరులొలికే పంటలూ- మన తెలుగు వారి వంటలు  || ముద్దపప్పు||
( శ్రీ రాయచోటి కృష్ణమూర్తి గారిచే విరచితము)
~~~~Forwarded~~~~